Sat Mar 15 2025 18:50:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ చేయకూడదని డెసిషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా నేతలతో మరోసారి చర్చించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దాదాపు ఎమ్మెల్సీగా ఎన్నికయినట్లేనని చెబుతున్నారు.
నేతలతో మాట్లాడి...
విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోవడంతో చంద్రబాబు పోటీకి వెనక్కు తగ్గారు. చంద్రబాబు విశాఖ జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. హుందాతనంగా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు అన్నారు. అయితే తగిన బలం లేకపోవడంతోనే చంద్రబాబు ఈ ఎన్నికల్లో వెనక్కు తగ్గారు. ఈ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
Next Story