Mon Dec 23 2024 13:55:21 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ రెడ్డీ... నువ్వు భయపడుతున్నావ్
కుప్పంలో కార్యకర్తలపై అక్రమ కేసులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
కుప్పంలో కార్యకర్తలపై అక్రమ కేసులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ రెడ్డీ నువ్వు భయపడుతున్నావు అంటూ ఆయన ట్వీట్ చేశఆరు. కుప్పంలో ఆడబిడ్డలపై హత్యాయత్నం కేసులు నీ అభద్రతకు చిహ్నమని అన్నారు. నీ పతనానికి నిదర్శనమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
పోలీసులపై...
దిగజారిన రాజకీయ చరిత్రలో జగన్ రెడ్డి ఒక పర్యాయపదమని చంద్రబాబు అన్నారు. మహిళలు తమను చంపడానికి వచ్చారని హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులు ఆ డిపార్ట్మెంట్ లో ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని చంద్రబాబు ప్రశ్నించారు. సమాజం ఆ అధికారుల దిగజారుడుతనాన్ని అసహ్యించుకుంటుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Next Story