Mon Dec 23 2024 16:26:15 GMT+0000 (Coordinated Universal Time)
గుంతలు పూడ్చలేరు కాని.. రాజధానులు కడతారా?
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేవారు
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేవారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని ఈ ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలోని కోడుమూరు రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. చెత్తపై పన్ను వేసిన ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధిని చేస్తానంటే ఎలా నమ్ముతారని ఆయన నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి మరొకటి తెలియదన్నారు.
ఎవరూ భయపడకండి....
జగన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. కోడుమూరులో కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. సాగునీటి ప్రాజెక్టులను కూా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టును అయినా పూర్తి చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకుని పనికిమాలిన శాఖగా మార్చారని, ఎవరూ కేసులకు భయపడాల్సిన పనిలేదని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు.
Next Story