Sat Dec 21 2024 08:14:13 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి చంద్రబాబు సమీక్ష
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. ఈరోజు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షించనున్నారు. రాజోలు, భీమవరం, గంగాధర నెల్లూరు, కడప, సూళ్లూరుపేట, నంద్యాల నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ యా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, ఇన్ఛార్జుల పనితీరుపై చంద్రబాబు సమీక్షించనున్నారు.
పరిస్థితి.. పనితీరు...
కొందరికి ఈ సందర్భంగా క్లాస్ పీకే అవకాశాలున్నాయి.పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించని నియోజకవర్గ ఇన్ఛార్జులను మారుస్తానని ఇప్పటికే ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకూ 150 శాసనసభ నియోజకవర్గాలను సమీక్షించిన చంద్రబాబు నేటి నుంచి మిగిలిన నియోజకవర్గాల సమీక్షను కూడా నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story