Mon Dec 23 2024 14:36:16 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లుండి చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 22న రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 22న రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరద బాధిత ప్రాంతాల్లో....
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ మూడు జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. వేలాది ఎకరాలు నీట మునిగాయి. పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ జిల్లాల్లో పర్యటించి వరద ముప్పునకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు.
Next Story