Mon Dec 23 2024 08:25:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్నూలు జిల్లాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఆయన ఓర్వకల్లు విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రానికి చంద్రబాబు పత్తికొండకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
మూడు రోజుల పర్యటన...
ఈరోజు రాత్రికి చంద్రబాబు ఆదోని చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఆదోనిలో రోడ్ షోను చంద్రబాబు నిర్వహిస్తారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం నుంచి రోడ్ షో ప్రారంభిస్తారు. తేరుబజార్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి కర్నూలులో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యే చంద్రబాబు వారితో చర్చించనున్నారు. టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Next Story