Mon Dec 23 2024 07:19:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కోనసీమకు చంద్రబాబు
నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు
నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. రామచంద్రపురం, కడియం, రాజమహేంద్రవరంలో చంద్రబాబు పర్యటిస్తారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నేడు తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పర్యటించనున్నారు.
పంట నష్టపోయిన...
ఈ సందర్భంగా చంద్రబాబు పంటనష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. ఉదయం రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటలో, మధ్యాహ్నం కడియం ఆవలో దెబ్బతిన్న పంటల పరిశీలిస్తారని పార్టీ నేతలు తెలిపారు. రైతు పోరాట కార్యాచరణను ఈ సందర్భంగా ప్రకటించనున్నారు.
Next Story