Mon Dec 23 2024 06:27:15 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరిలోని రెండు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరిలోని రెండు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గత మూడు రోజుల నుంచి ఆయన తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రజాగళం యాత్ర ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత తొలిసారి జిల్లాకు చంద్రబాబు వస్తుండటంతో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున సభలకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
నరసాపురం, పాలకొల్లు...
ఈరోజు ఆయన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పాలకొల్లులో రేపు కూటమి అభ్యర్థులతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో సమావేమవుతారు. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయంతో పాటు ఓట్ల బదిలీపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు నరసాపురం, పాలకొల్లు సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.
News Summary - telugu desam party chief chandrababu will visit two constituencies in west godavari today
Next Story