Mon Dec 23 2024 02:55:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన చిత్తూరు జిల్లా ఎస్పీ, పలమనేరు డీఎస్పీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. తన కుప్పం పర్యటన గురించి అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినా అనుమతులకు నిరాకరించారని పేర్కొన్నారు. జీవో నెంబరు 1 ప్రకారం తనకు ప్రత్యామ్నాయ వేదిక చూపడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్నారు.
వారిపై చర్యలు...
గతంలో కూడా తన పర్యటనలో పోలీసులు సరైన భద్రత కల్పించలేదని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వహించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు. తన నియోజకవర్గం ప్రజలతోనూ, కార్యకర్తలతోనూ తాను సమావేశమయ్యేందుకు అనుమతి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతులు కావాలని నిరాకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Next Story