Mon Dec 23 2024 07:12:02 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని, మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 17వ తేదీకి...
అయితే దీనిపై సీఐడీ తరుపున న్యాయవాదుల అభ్యంతరాలను తెలియజేయాలని న్యాయస్థానం కోరింది. దీనిపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నెలరోజులకు పైగానే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటీషన్ పదిహేడో తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే. రేపు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది.
Next Story