Mon Dec 23 2024 12:26:31 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. రాధా ఇంటి వద్ద రెక్కీపై?
వంగవీటి రాధా ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు
వంగవీటి రాధా ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. రాధా ఇంటివద్ద రెక్కీ నిర్వహించడం రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయన్నారు. వంగవీటి రాధాను హత మార్చాలనే రెక్కీ నిర్వహించినట్లు అర్ధమవుతుందన్నారు. ఈ కేసులో వెంటనే పోలీసులు దోషులను పట్టుకుని శిక్షించాలని చంద్రబాబు కోరారు.
దోషులకు శిక్ష పడితేనే....
దోషులకు శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాధాను హతమార్చేందుకే రెక్కీ నిర్వహించినట్లుందన్నారు. ఏపీలో జంగిల్ అండ్ గూండారాజ్యం నెలకొందని, పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాధా ఇంటి వద్ద రెక్కీపై పోలీసులు పారదర్శకంగా విచారణ జరపాలని చంద్రబాబు కోరారు. మరోవైపు వంగవీటి రాధాకు ఫోన్ చేసి చంద్రబాబు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Next Story