Sun Apr 06 2025 22:48:26 GMT+0000 (Coordinated Universal Time)
చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో టీడీపీ సీనియర్ నేతల సమావేశం
నేడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ సమావేశం అయింది.

నేడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ సమావేశం అయింది. ఉదయం పదకొండు గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమయింది. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారికి ట్రైనింగ్ సీనియర్లు ఇవ్వనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన పద్ధతులను వివరించనున్నారు.
కౌంటింగ్ రోజు...
కౌటింగ్ రోజు ఎలా వ్యవహరించాలనే దానిపై శిక్షణ ఇవ్వనున్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలు టీడీపీ సీనియర్లు ఇవ్వనున్నారు. కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనుండటంతో కౌంటింగ్ కేంద్రాల్లో ప్రధానంగా పోస్టల్ బ్యాలట్లపై ఎలా వ్యవహరించాలన్న దానిపై చీఫ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
Next Story