Thu Dec 19 2024 17:02:58 GMT+0000 (Coordinated Universal Time)
ముర్ముకే మద్దతు.. బాబు నిర్ణయం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం మంచి పరిణామమని చంద్రబాబు అన్నారు. సామాజిక న్యాయానికి తొలినుంచి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. గతంలో నూ కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాలకు మద్దతు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యేందుకు నంద్యాలలో తమ పార్టీ అభ్యర్థిని కూడా పోటీకి దింపలేదన్నారు.
సామాజిక న్యాయాన్ని...
తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఎప్పటి నుంచో ముందు ఉంటుందని చెప్పారు. దళిత వర్గానికి చెందని బాలయోగిని లోక్ సభ స్పీకర్ గానూ, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గానూ ఎంపిక చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ నెల 18 వ తేదీన జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తారని ఆయన తెలిపారు.
Next Story