Thu Jan 16 2025 05:46:09 GMT+0000 (Coordinated Universal Time)
TDP : సభ్యత్వ నమోదులో రికార్డు క్రియేట్ చేసిన టీడీపీ
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదులో అందరి రికార్డులను అధిగమించింది. కోటి మార్క్ ను దాటేసింది
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదులో అందరి రికార్డులను అధిగమించింది. ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. సభ్యత్వ నమోదులో తొలి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందరు ఎమ్మెల్యేలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. కేవలం వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది టీడీపీలో సభ్యత్వాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారు. కేవలం సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశంపైనే అనేక సార్లు చంద్రబాబు, లోకేష్ లు నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లు కూడా నిర్వహించారు.
ఎప్పటికప్పుడు సమావేశాలు...
వారు జరిపిన సమావేశాలు ఫలప్రదమయ్యాయని చెప్పాలి. మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఉండబోవడంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో జరుగుతుండటంతో అనేక మంది నేతలు ఉత్సాహంగా సభ్యత్వ నమోదు విషయంలో చురుగ్గా పనిచేశారు. సభ్యత్వాల నమోదు విషయంలో అలసత్వంగా ఉన్న వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. చివరకు మంత్రులను కూడా చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి సభ్యత్వ నమోదు విషయంలో సీరియస్ నెస్ పెట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి గతంలో కంటే భిన్నంగా ఈసారి అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
తొలి రెండు స్థానాలు నెల్లూరుకే...
సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాల రికార్డు బద్దలు తెలుగుదేశం పార్టీ బద్దలు కొట్టింది. పార్టీ ఆవిర్భావం తర్వాత కోటి మార్కుకు తొలిసారి దాటిందింది. సభ్యత్వ నమోదులో తొలి స్థానంలో నెల్లూరు నగరం ఉండటం విశేషం. రెండో స్థానంలో ఆత్మకూరు నియోజకవర్గం ఉంది. అంటే తొలి రెండు స్థానాలు నెల్లూరు జిల్లాకే దక్కడం విశేషం. మూడో స్థానంలో పాలకొల్లు నియోజకవర్గం ఉంది. ఐదో స్థానంలో కుప్పం నియోజకవర్గం నిలించింది. తెలంగాణలో 15 లక్షల వరకూ సభ్యత్వాలు నమోదు కావడం విశేషం. సభ్యత్వాల నమోదు విషయంలో చురుగ్గా వ్యవహరించిన నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు సమాచారం.
Next Story