Sat Apr 12 2025 14:48:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన
తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్క దారి పట్టించడంపై టీడీపీ ఆందోళనలకు పిలుపు నిచ్చింది. పేదలకు ఇవ్వాల్సిన రేషన బియ్యాన్ని ఇతర దేశాలకు వైసీపీ నేతలు తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రేషన్ బియ్యాన్ని...
దీంతో రేషన్ బియ్యాన్ని పేదలకు పంచాలంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టీడీపీ దిగనుంది. అన్ని ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట నిరసనలు చేయాలని పిలుపు నిచ్చింది. అనంతరం రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాంటూ తహసిల్దార్ కు టీడీపీ నేతలు వినతి పత్రం అంద చేయనున్నారు.
Next Story