Tue Dec 24 2024 02:32:13 GMT+0000 (Coordinated Universal Time)
గన్నవరం సబ్ జైలుకు పట్టాభి
గన్నవరం సబ్ జైలుకు తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిని పోలీసులు తరలించారు.
గన్నవరం సబ్ జైలుకు పట్టాభిని పోలీసులు తరలించారు. పట్టాభి గాయాలపై ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికన పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోలీసు అధికారిపై దాడికి కారణమయ్యారని, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అయితే న్యాయమూర్తి ఎదుట తనపై పోలీసులు థర్డ్ డిగ్రీని ఉపయోగించారని ఆరోపించారు.
నివేదిక ఇచ్చిన తర్వాత...
దీనిపై పట్టాభి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పట్టాభిని పరిశీలించి పెద్దగా గాయాలేవీ లేవని చెప్పడంతో గన్నవరం సబ్ జైలుకు తరలించారు. గన్నవరం ఘర్షణలో పట్టాభితో పాటు మరో 11 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గన్నవరం సబ్ జైలు జైలర్ మాత్రం ఇక్కడ పట్టాభిని ఉంచితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. మరి పట్టాభి విషయంలో మరోసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Next Story