Thu Dec 19 2024 08:15:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గుంటూరు జిల్లాలో టీడీపీ నిజనిర్ధారణ పర్యటన
నేడు గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటించనున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించనున్నారు
నేడు గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు పర్యటించనున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించనున్నారు. డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించారు. ఈ బృందం పర్యటించి నివేదిక ఇవ్వనుంది.
నివేదిక ఇచ్చిన తర్వాత...
గుంటూరు జిల్లా డయేరియా వ్యాప్తి చెందడంతపై క్షేత్రస్థాయిలో నిజ నిర్థారణకు నియమించిన ప్రత్యేక బృందం నేడు పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో సభ్యులుగా నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, మహమ్మద్ నసీర్ లు ఉన్నారు. వాస్తవ పరిస్థితులపై పార్టీకి నివేదికను కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు.
Next Story