Mon Dec 23 2024 15:07:36 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఇంటికి గంటా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వచ్చారు. అమరావతిలోని ఆయన నివాసం వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలందరూ చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గంటా శ్రీనివాసరావు గత కొంత కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈరోజు మాత్రం ఆయన చంద్రబాబు ఇంటికి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఆ ఇద్దరు మాత్రం...
గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. అయితే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా ఆయన అసెంబ్లీకి రానున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉండటంతో తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు.
Next Story