Sun Mar 30 2025 13:03:27 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టుకు లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. లోకేష్ ను త్వరలోనే ఈ కేసులో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. లోకేష్ ను అరెస్ట్ చేయడానికి కొందరు సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ముందస్తు బెయిల్...
ఈ నెల 29వ తేదీ నుంచి నారా లోకేష్ యువగళం ప్రారంభం కానుంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే పాదయాత్రకు ముందే ఈ కేసులో అరెస్ట్ చేస్తారని భావించిన నారా లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు.
Next Story