Sun Apr 27 2025 01:59:02 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు లోకేష్ వార్నింగ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్న హత్యలు, దాడులు మీ పతనానికి కారణమవుతాయన్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతోనే టీడీపీ క్యాడర్ ను హత్యలు చేసి భయపెట్టాలనుకుంటున్నారని లోకేష్ మండి పడ్డారు. రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బాలకొటిరెడ్డి పై హత్యాయత్నం వైసీపీ గూండాలపనేనని లోకేష్ అన్నారు.
హత్యా రాజకీయాలతో....
వైసీపీ రౌడీ మూకలు ఎంతగా బరితెగించాయో తెలిసిపోతుందని అన్నారు. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే ఎంత బరితెగించారో ఇట్టే అర్థమవుతుందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లడ్ లోనే ఫ్యాక్షన్ మనస్తత్తం ఉన్న జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు మానుకోకుంటే ఇంతకు నాలుగింతలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని లోకేష్ హెచ్చరించారు.
Next Story