Sun Apr 27 2025 00:36:22 GMT+0000 (Coordinated Universal Time)
అదీ ఒక గెలుపేనా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో వైసీపీ నేతలు దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని లోకేష్ అన్నారు. టౌన్ బ్యాంకు ఎన్నికల్లో జగన్ రెడ్డి దొంగ బతుకు మరోసారి బయటపడిందని లోకేష్ వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ నేతలను.......
తెలుగుదేశం పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి దొంగ ఓట్లు వేయించుకుంటున్నారని, అసలు హౌస్ అరెస్ట్ చేసే అధికారం ఎవరిచ్చారని లోకేష్ ప్రశ్నించారు. దొంగ ఓట్లను వేస్తున్న వారిని వదిలేసి పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేయడమేంటని నిలదీశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Next Story