Mon Dec 23 2024 13:34:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు లోకేష్ పాదయాత్రకు బ్రేక్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇప్పటి వరకు లోకేష్ 815.7 కి.మీ.దూరం నడిచారు. నేడు కూడా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర జరగాల్సి ఉంది. అయితే ఈరోజు పాదయాత్రకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకోనున్నారు.
రైతులతో సమావేశం...
సాయంత్రం నాలుగు గంటలకు జంబులదిన్నె కొట్టాల వద్ద రైతన్నతో లోకేష్ కార్యక్రమంలో పాల్గొంటారు.జంబులదిన్నె కొట్టాల విడిది కేంద్రంలో బస చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ ముఖ్యనేతలు లోకేష్ ను కలిసి రానున్న ఎన్నికల గురించి చర్చించనున్నారు.
- Tags
- nara lokesh
- break
Next Story