Mon Dec 23 2024 15:34:57 GMT+0000 (Coordinated Universal Time)
చాన్నాళ్లకు లోకేష్ మంగళగిరిలో?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు మంగళగిరిలో పర్యటిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు మంగళగిరిలో పర్యటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత లోకేష్ మంగళగిరికి రావడంతో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. మంగళగిరి పట్టణంలో వార్డుల్లో లోకేష్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో...
లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పెద్దగా మంగళగిరిలో పర్యటించలేదు. కరోనా సమయంలోనూ ఆయన నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. కానీ ఈరోజు లోకేష్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఇటీవల కాలంలో మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకుల ఇంటికి వెళ్లి లోకేష్ పరామర్శిస్తున్నారు.
Next Story