Sun Dec 22 2024 12:07:40 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేడు ముమ్మడివరంలో లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో పాదయత్ర చేయనున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో పాదయత్ర చేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు పేరూరు నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమయింది. 9 గంటలకు క్షత్రియ కల్యాణమండపంలో ఆక్వా రైతులతో లోకేష్ సమావేశం కానున్నారు. పది గంటలకు హైస్కూలు సెంటర్ లో బీసీలతో సమావేశమై వారి సమస్యలతో చర్చించనున్నారు. అనంతరం అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో చేనేతలతో ఆయన సమావేశం కానున్నారు. పదిన్నర గంటలకు ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో సమావేశం అవుతారు.
వివిధ వర్గాలతో భేటీ అయి...
అనంతరం అమలాపురంలోని పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో భేటీ అయి వారి సమస్యలపై చర్చించనున్నారు. పదకొండు గంటలకు అమలాపురం వెంకటేశ్వసామి గుడివద్ద కాపు సామాజికవర్గం ప్రజలతో మమేకం కానున్నారు. భట్నవిల్లిలో ఎస్సీ సామాజిక వర్గీయులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. భట్నవిల్లిలో భోజన విరామం కోసం ఆగుతారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అమలాపురంలో పాదయాత్ర ముగించుకుని ముమ్మడి నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ముమ్మడివరంలో రాత్రి బస చేయనున్నారు.
Next Story