Mon Dec 15 2025 04:00:51 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : 18న నారా లోకేష్ నామినేషన్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 18వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 18వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. తనను ఈసారి మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారని, తనపై ప్రజలకు నమ్మకం ఉందని నారా లోకేష్ తెలిపారు.
పెద్దయెత్తున అభిమానులు...
2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 18వ తేదీన జరిగే నామినేషన్ కార్యక్రమానికి పెద్దయెత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు.
Next Story

