Mon Dec 23 2024 11:02:12 GMT+0000 (Coordinated Universal Time)
పాదయాత్ర వద్దకు నారా బ్రాహ్మణి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. అయితే నిన్న రాత్రి లోకేష్ బస చేసిన చోటకు నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ చేరుకున్నారు. తండ్రిని చూడాలని అనగానే నారా బ్రాహ్మణి దేవాన్ష్ తో కలసి బయలుదేరి చిత్తూరు జిల్లాకు వచ్చారు. ఇంటి నుంచి వండి తెచ్చిన భోజనాన్ని లోకేష్ కు తినిపించారు. దాదాపు పదిహేను రోజుల నుంచి లోకేష్ పాదయాత్రలోనే ఉండి బయట భోజనం తింటుండటంతో ఆయనకు ఆప్యాయంగా సతీమణి బ్రాహ్మణి ఇంటి నుంచి భోజనం తెచ్చి మరీ పెట్టారు.
ఇంటి భోజనం తెచ్చి...
ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరగనుంది. కొత్తూరు నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. మరికాసేపట్లో ఈడగపల్లెలో గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రజలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు కొత్తిరివేడు గ్రామం వద్ద స్థానికులతో మాటామంతీ కలపనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భోజన విరామానికి ఆగుతారు. అనంతరం సాయంత్రం గొల్లకండ్రిక వద్ద స్థానికులతో సమావేశమవుతారు. రాత్రికి లోకేష్ శ్రీవెంకటేశ్వర పెరుమాల్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా బస చేయనున్నారు.
Next Story