Mon Dec 23 2024 17:57:01 GMT+0000 (Coordinated Universal Time)
13వరోజుకు చేరిన లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటికి పదమూడో రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేటికి పదమూడో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ లోకేష్ 145.9 కిలోమీటర్ల మేర నడిచారు. నేడు చిత్తూరు అసెంబ్లీ నియజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు దిగువమాసపల్లి రాత్రి బస నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం ఆయన 9.45 గంటలకు అయ్యనవేడు గ్రామస్థులతో సమావేశమవుతారు.
నేడు జీడీ నెల్లూరు...
11.45 గంటలకు అరదలతో యువతతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. పన్నెండు గంటలకు అరదలలో భోజన విరామానికి ఆగుతారు. అక్కడే రైతులతో సమావేశమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. రెండు గంటలకు అరదల నుంచి బయలుదేరి సాయంత్రానికి పాదయాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. అక్కడే ముత్యాలమ్మ తల్లి గుడి ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు.
Next Story