Mon Dec 23 2024 18:42:19 GMT+0000 (Coordinated Universal Time)
నేడు లోకేష్ పాదయాత్ర ఇలా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 11వ రోజుకు చేరుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 11వ రోజుకు చేరుకుంది. మంగసముద్రంలోని విడిది కేంద్రం నుంచి బయలుదేరిన పాదయాత్ర చిత్తూరు నియోజకవర్గంలో కొనసాగనుంది. బీడీ కాలనీలో బీడీ వర్కర్క్స్ తో భేటీ అయ్యారు. అనంతరం చిత్తూరు కోర్టు సర్కిల్ లో న్యాయవాదులతో లోకేష్ సమావేశమయ్యారు. గ్రీమ్ప్ పేటలో పార్టీ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై లోకేష్ చర్చలు జరిపారు.
ముఖాముఖి కార్యక్రమంలో...
మరికాసేపట్లో టీటీడీ కల్యాణమండపం వెనక అమరరాజా ప్రాంగణంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడే భోజన విరామానికి ఆగుతారు. మధ్యాహ్నం 3.05 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ప్రజలతో సమావేశమవుతారు. అలాగే యువతతో భేటీ కానున్నారు. రాత్రికి కుంగిరెడ్డిపల్లి కేఆర్ నగర్ కాలనీలో బస చేయనున్నారు.
Next Story