Sat Nov 23 2024 04:44:31 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ యాత్ర నేటి షెడ్యూల్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 53వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 53వ రోజుకు చేరుకుంది. పెనుకొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకూ లోకేష్ 661.4 కిలోమీటర్ల దూరం నడిచారు. ఉదయం 9 గంటలకు గుమ్మయ్యగారిపల్లి వద్ద బస నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.పది గంటలకు బాలన్నగారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. అనంతరం మల్లపల్లిలో ఇటుకతయారీ కార్మికులతో భేటీ కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు పాలసముద్రం క్రాస్ వద్ద వెనుకబడిన సామాజికవర్గం ప్రజలతో ముఖాముఖి కార్కక్రమంలో లోకేష్ పాల్గొంటారు.
వరస సమావేశాలతో...
అనంతరం పాలసముద్రం క్రాస్ వద్ద భోజన విరామానికి ఆగుతారు.తర్వాత పాలసముద్రం క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. పాలసముద్రం క్రాస్ వద్ద లాయర్లతో సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు.మధ్యాహ్నం 2.55 గంటలకు బెల్లాలచెరువు వద్ద స్థానికులతో సమావేశమవుతారు.సాయంత్రం 3.30 గంటలకు మిషన్ తండా వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. సాయంత్రం 4.25 గంటలకు ఎస్ఎల్ఎపి కంపెనీ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం గుడిపల్లిలో స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. సాయంత్రం 6.50 గంటలకు నల్లగొండ్రాయనిపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. రాత్రి 7.15 గంటలకు నల్లగొండ్రాయనిపల్లి బస చేయనున్నారు.
Next Story