Sat Nov 23 2024 04:31:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు లోకేష్ పర్యటన ఇలా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 66వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 66వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు లోకేష్ 830.1 కి.మీ.దూరం నడిచారు. ఉదయం 8 గంటలకు శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలోని సోడనంపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఉదయం 9 గంటలకు పెద్దమట్లగొందిలో యాదవ సామాజికవర్గీయులతో లోకేష్ భేటీ అయ్యారు. మరికాసేపట్లో చిన్నమట్లగొందిలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు.
వివిధ సామాజికవర్గాలతో...
ఉదయం11.10 – సలకం చెరువులో గాండ్ల సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. 11.50 గంటలకు సలకంచెరువులో ఎస్సీ సామాజిక వర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 12.50 గంటలకు సలకంచెరువు శివార్లలో భోజన విరామానికి ఆగుతారు. మధ్యాహ్నం 2 గంటలకు సలకంచెరువు శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం మేడె గంటలో కొరివిపల్లిలో స్థానికులతో లోకేష్ సమావేశమవుతారు. సాయంత్రం 4.10 గంటలకు ఉల్లికల్లులో స్థానికులతో సమావేశమవుతారు. 5.50 గంటలకు ఉల్లికుంటపల్లి విడిది కేంద్రంలో రాత్రి బస చేయనున్నారు.
Next Story