Mon May 05 2025 21:48:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు యువగళం ఇలా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 68వ రోజుకు చేరుకుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 68వ రోజుకు చేరుకుంది. తాడిపత్రిలో నేడు లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకే పాదయాత్ర ప్రారంభమైంది. రాయలచెరువు సమీపంలో రాత్రి విడిది నుంచి ప్రారంభమైన యాత్ర నేడు యాడికి మండలంలో జరుగుతుంది. ఉదయం 7.30 గంటలకు కొట్టాలపల్లె వ్ద మిర్చి రైతులో నారా లోకేష్ సమావేశమయ్యారు. 8.10 గంటలకు కమ్మవారిపల్లె వద్ద నిరుద్యోగ యువతతో భేటీ అయి వారి సమస్యలపై చర్చించనున్నారు. నగరూరులో భోజన విరామానికి లోకేష్ ఆగుతారు.
యాడికి మండలంలోకి...
అనంతరం యాడికి మండలంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. నగరూరులో రైతులతో సమావేశమై గిట్టుబాటు ధరలు, పంటల పరిస్థితిపై చర్చిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు తుట్రాళ్లపల్లిలో వృద్ధులు, పట్టురైతులతో జరిగే మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు టి.కొత్తపల్లిలో అరటి రైతులతో లోకేష్ భేటీ కానున్ారు. అనంతరం రాయలచెరువు వద్ద సాయంత్రం ఐదు గంటలకు బస చేస్తారు. రాత్రికి చందన రోడ్డు సమీపంలో బస చేస్తారు.
Next Story