Mon Nov 25 2024 07:43:07 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులోనే లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 92వ రోజుకు చేరుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 92వ రోజుకు చేరుకుంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఇప్పటి వరకూ లోకేష్ 1169 కిలోమీటర్ల దూరం నడిచారు. ఉదయం ఎస్టీబీసీ గ్రౌండ్స్ నుంచి బయలుదేరి ఇన్కం టాక్స్ సర్కిల్లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమయ్యారు. 7.25 గంటల్ె మున్సిపల్ ఆఫీసు వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7.40 గంటలకు శ్రీలక్ష్మి స్కూలు జంక్షన్ లో లింగాయత్, టిడ్కో బాధితులతో సమావేశ అయ్యారు. 7.50 గంటలకు కొత్తపేట కమ్యూనిటీ హాలు వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 8గంటలకు జిల్లా కోర్టు వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు.
యువగళం నేడు...
8.20గంటలకు కొండారెడ్డి బురుజు వద్ద ఎలక్ట్రికల్ వర్కర్లతో సమావేశం కానున్నారు. 8.30 గంటలకు అంబేద్కర్ సర్కిల్లో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 8.45 గంటలకుక పెద్దమార్కెట్ లో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 9.05 గంటలకు చౌక్ లో రోజువారీ కార్మికులతో సమావేశం కానున్నారు. 9.15 గంటలకు చిన్నమ్మవారిశాలలో వైశ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. 10.05 గంటలకు మండీబజార్ లో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు.10.15 గంటలకు కుబూసూరత్ మసీదు వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు.10.40 గంటలకు దర్వేష్ ఖాద్రి దర్గా వద్ద వడ్డెర్లతో సమావేశం కానున్నారు.11.00గంటలకు ఉస్మానియా కాలేజి గ్రౌండ్ లో భోజన విరామానికి ఆగుతారు.
మాటా మంతీ...
సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా కాలేజి గ్రౌండ్ నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. 4.05 గంటలకు ఉమర్ అరబిక్ స్కూలు వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 4.15 గంటలకు బుధవారపుపేట వద్ద స్థానికులతో సమావేశం అవుతారు. 4.30 గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలతో సమావేశం కానున్నారు. 4.40 గంటలకు కాళికామాత టెంపుల్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 4.50 గంటలకు కుమ్మరిగేటు 4వరోడ్డులో యాదవులతో సమావేశం కానున్నారు. 5గంటలకు నైమిషాంబ గుడి వద్ద స్థానికులతో సమావేశమవుతారు. 5.15 గంటలకు షంషా మదర్సా వద్ద స్థానికులతో సమావేశమవుతారు. 7.30 గంటలకు పుల్లయ్య కాలేజి వద్ద బస చేయనున్నారు.
Next Story