Mon Dec 23 2024 04:36:47 GMT+0000 (Coordinated Universal Time)
వెయ్యి కి.మీలకు చేరువలో
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 74వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 74వ రోజుకు చేరుకుంది. నేడు కూడా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 949 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు పల్లెదొడ్డి బస నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం 7.30 గంటలకు స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. అనంతరం 8.25 గంటలకు గద్దెరాలలో స్థానికులతో లోకేష్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరస సమావేశాలతో...
ఉదయం 10.05 గంటలకు దేవరకొండ ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీసీ సామాజికవర్గం ప్రజలతో లోకేష్ సమావేశం అవుతారు.10.20 గంటలకు దేవరకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులతో సమావేశం కానున్నారు.11.30 గంటలకు దేవరకొండ క్రాస్ వద్ద టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులతో భేటీ కానున్నారు.12.25 గంటలకు కుంకనూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 12.40 గంటలకు కుంకనూరు క్రాస్ వద్ద భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం 3.35 గంటలకు కుంకనూరు క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 5.05 గంటలకు అల్లారుదిన్నె వద్ద కురుబ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 5.30 గంటలకు వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. రాత్రికి వలగొండ క్రాస్ వద్ద బస చేస్తారు.
Next Story