Sun Apr 13 2025 08:26:22 GMT+0000 (Coordinated Universal Time)
ఎండలేదు.. వాన లేదు.. ఒకటే లక్ష్యం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 85వ రోజుకు చేరుకుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 85వ రోజుకు చేరుకుంది. నేడు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 1,081 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు ఉదయం ఎమ్మిగనూరు ఈఎస్వి వే బ్రిడ్జి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.15 గంటలకు ఎమ్మిగనూరు అనంతపద్మనాభ స్వామి దేవాలయం వద్ద డ్వాక్రా మహిళలతో లోకేష్ భేటీ కానున్నారు. 3.30 గంటలకు ఎమ్మిగనూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఎన్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమావేశమవుతారు.
85వ రోజుకు చేరిన యువగళం...
సాయంత్రం నాలుగు గంటకు శ్రీనివాస సర్కిల్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 4.10 గంటలకు ఉప్పరవీధిలో ఉప్పర సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. 4.20 గంటలకు వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి బోయలతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. 4.30 గంటలకు సోమప్ప సర్కిల్ వద్ద ముస్లింలతో సమావేశమవుతారు. 4.40 గంటలకు ఎస్ బిఐ సర్కిల్ వద్ద స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులతో భేటీ. కానున్నారు. 4.50 గంటలకు మోర్ షాపింగ్ మాల్ వద్ద స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. 5.05 గంటలకు ఎమ్మిగనూరు పార్కు వద్ద చేనేతలతో సమావేశమవుతారు. 5.15 గంటలకు ఎమ్మిగనూరు సొసైటీ వద్ద జరగనున్న బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రికి ఎమ్మిగనూరు శివారులో బస చేస్తారు.
Next Story