Sun Dec 22 2024 12:44:29 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : యువగళం @ 2900
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ముమ్మడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 2886 కిలోమీటర్ల మేర నడిచారు. ముమ్మడివరం నుంచి ఉదయం బయలుదుని కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రా మహిళలతో భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ముమ్మడివరం ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాల వద్ద గౌడలతో సమావేశంవుతారు. పదకొండు గంటలకు ముమ్మడివరం సెంటర్ లో బహిరంగసభ నిర్వహించనున్నారు.
వివిధ వర్గాలతో...
12.45 గంటలకు ముమ్ముడివరం పల్లెపాలెం సెంటర్ లో దళితులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొమనాపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అన్నంపల్లి సెంటర్ లో మాదిగ సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 3.30 గంటలరే మురమళ్ల సెంటర్ లో బుడగ జంగాలతో సమావేశమవుతారు. సాయంత్రం 6గంటలకు కొమరగిరిలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. 7.15 గంటలకు ఎదుర్లంక సెంటర్ లో స్థానికులతో సమావేశమవుతారు. 7.30 గంటలకు పాత ఇంజరం వద్ద పాదయాత్ర 2900 కి.మీ.లకు చేరనుంది. దీంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరిస్తారు. రాత్రికి సుంకరపాలెం విడిది కేంద్రంలో బస చేస్తారు.
Next Story