Mon Dec 23 2024 09:18:18 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది.
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కౌరవ సభను తలపించేలా సభ నడుస్తుంటే ఇక సమావేశాలకు వెళ్లి ఏం లాభమని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆయన చెప్పారు.
ప్రతిపక్ష నేతలకు మైకు...
కనీసం ప్రతిపక్ష పార్టీ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా ముఖ్యమంత్రి జగన్ ను పొగడటమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 40ఏళ్ల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో, మహానాడును విజయవాడలో జరపాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించామన్నారు
Next Story