Mon Dec 23 2024 13:37:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరూ వియ్యంకులు... ప్రేమ వివాహానికి ఓకే
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ, టీడీపీ కీలక నేత ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులు కాబోతున్నారు
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ, టీడీపీ కీలక నేత ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులు కాబోతున్నారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన బొండ ఉమ కుమారుడు సిద్ధార్థ్, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వితల నిశ్శితార్థం జరగనుంది. హైదరాబాద్ లో ఈ నిశ్శితార్థాన్ని ఏర్పాటు చేశఆరు.
అమెరికాలో కలసి....
వీరిద్దరూ అమెరికాలో కలసి చదువుకొనడంతో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి వివాహానికి పెద్దలు అంగీకరించడంతో వీరి వివాహం ముహూర్తాన్ని నిర్ణయించనున్నారు. ఏవీ సుబ్బారెడ్డి గతంలో భూమా నాగిరెడ్డికి సన్నిహితుడిగా మెలిగారు. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. బొండా ఉమ మాజీ ఎమ్మెల్యే. టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు వియ్యంకులు కాబోతున్నారు.
Next Story