Mon Dec 23 2024 09:57:44 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు ముప్పు ఉంది.. రక్షణ కల్పించండి
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డికి లేఖ రాశారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డికి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రక్షణ కల్పించాలని కోరారు. సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని వర్ల రామయ్య తన లేఖలో కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.
కేంద్ర కార్యాలయంపై...
గతంలోనూ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయాన్ని వర్ల రామయ్య గుర్తు చేశారు. నిత్యం వందల సంఖ్యలో తమ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారని, వారికి రక్షణ కల్పించేలా సాయుధ బలగాలు 24 గంటల పాటు పహారా కాసేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య రాసిన లేఖలో కోరారు.
- Tags
- varla ramaiah
- tdp
Next Story