Mon Dec 23 2024 10:15:45 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ డైరెక్టర్ కు వర్ల లేఖ.. ఆయనను బదిలీ చేయాలంటూ
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. కడప జిల్లా జైలర్ గా నియమించిన వరుణ్ రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయాలని ఆయన లేఖలో కోరారు. వరుణ్ రెడ్డి అక్కడ జైలరుగా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు రక్షణ ఉండదని వర్ల రామయ్య తెలిపారు. వరుణ్ రెడ్డి ట్రాక్ రికార్డు సరిగా లేదని వర్ల రామయ్య లేఖలో గుర్తు చేశారు.
ఆయన ఉన్నప్పుడే...
వరుణ్ రెడ్డి అనంతపురం జిల్లా జైలులో ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను హత్యకు గురయ్యాడన్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా జైలర్ గా ఉన్నప్పుడు వరుణ్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. సస్పెన్షన్ కు గురయ్యాడని, అనేక ఆరోపణలపై అతనిపై విచారణ జరిగిందన్నారు. అయితే ఈ ప్రభుత్వం వరుణారెడ్డిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేసి కడప జిల్లా జైలుకు నియమించడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ప్రాణాలకు ముప్పు ఉందని తాము భావిస్తున్నామని, వరుణ్ రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయాలని వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు.
- Tags
- varla ramaiah
- tdp
Next Story