Mon Dec 16 2024 11:38:59 GMT+0000 (Coordinated Universal Time)
బీటెక్ రవి అరెస్ట్
తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెండింగ్ లో ఉందని చెబుతున్నారు. నారా లోకేష్ పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దురుసుగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. అయితే బీటెక్ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
మెజిస్ట్రేట్ ఎదుట...
అనంతరం కడప ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. తిరిగి ఈరోజు హాజరుపర్చాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలు కూడా బీటెక్ రవి ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలు లభించడంతోనే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చిన తర్వాత కాని బీటెక్ రవికి రిమాండ్ విధించేదీ లేనిదీ తెలియదు.
Next Story