Sun Dec 14 2025 10:02:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పరిటాల దీక్ష.. ధర్మవరంలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేడు నిరాహార దీక్షకు దిగనుంది. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో దీక్షకు దిగనుంది.

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేడు నిరాహార దీక్షకు దిగనుంది. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో దీక్షకు దిగనుంది. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను కంటిన్యూ చేయాలని కోరుతూ పరిటాల శ్రీరామ్ నేడు ఒకరోజు దీక్షకు దిగనున్నారు. దీంతో ధర్మవరంలో పెద్దయెత్తున పోలీసు బలగాలను మొహరించారు.
రెవెన్యూ డివిజన్ ను.....
ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేస్తుంటే వైసీపీ స్థానిక నేతలు ఏం చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ ప్రశ్నిస్తున్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేయవద్దని కోరుతూ కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

