Mon Dec 23 2024 07:35:45 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు గవర్నర్ వద్దకు టీడీపీ
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 పరీక్ష అక్రమాలపై నేడు గ తెలుగుదేశం బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనుంది.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 పరీక్ష అక్రమాలపై నేడు గ తెలుగుదేశం బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనుంది. 2018 గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలపై ఈ బృందం ఫిర్యాదు చేయనుంది. దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరనుంది. ఇటీవలే హైకోర్టు కూడా గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఏపీపీఎస్సీ అక్రమాలపై...
నిరుద్యోగులను నిలువునా ముంచారంటూ వైసీపీ పై టీడీపీ ఆరోపణలు చేస్తుంది. రెండుసార్లు మూల్యాంకనం చేయడం తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకేనని, లక్షలాది మంది నిరుద్యోగులను వంచించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందచేయనన్నారు.
Next Story