Sat Nov 23 2024 02:04:43 GMT+0000 (Coordinated Universal Time)
సర్వేలపై టీడీపీ చెబుతోంది ఇదే.!
ఇటీవలి కాలంలో పలు సర్వేలు వస్తున్నాయి.. ఈ సర్వేలు అన్నీ వైసీపీకి అనుకూలంగా వస్తూ ఉండడంతో
ఇటీవలి కాలంలో పలు సర్వేలు వస్తున్నాయి.. ఈ సర్వేలు అన్నీ వైసీపీకి అనుకూలంగా వస్తూ ఉండడంతో టీడీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. తాజాగా ఈ సర్వేలపై టీడీపీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి భారీ మెజార్టీ దక్కుతుందని జాతీయ మీడియాలో రావడమంతా ప్లాన్ అని అంటోంది. ఇటీవల ప్రైవేట్ రీసెర్చ్ సంస్థతో కలిసి చేపట్టిన సర్వేలో వైసీపీకి భారీ మెజార్టీ దక్కుతుందంటూ ముందస్తు సర్వే ఫలితాలను ప్రకటించారు.
తాడేపల్లిలో ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగానే సర్వేలు జరుగుతున్నాయని టీడీపీ అంటోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇరగవరపు అవినాష్‌కు చెందిన పలు సంస్థలు రూపొందించిన నివేదికల్ని సర్వే ఫలితాలుగా ప్రకటిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని ఈటీజీ-టైమ్స్ సర్వే చెప్పడం వెనుక ఇదే రహస్యం ఉందని.. ఏపీ ప్రభుత్వ బ్రాండ్ బిల్డింగ్ కోసం నాలుగేళ్లుగా టైమ్స్ సంస్థతో ఒప్పందం నడుస్తోందన్నారు. ఈ ఒప్పందంలో ప్రభుత్వానికి సానుకూల ప్రచారం కల్పించడం, చర్చా కార్యక్రమాలు వంటివి ఉన్నాయి. ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించిన ఈటీజీ సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఏపీ సిఎంఓలో కీలక పాత్ర పోషిస్తున్నారని టీడీపీ చెబుతోంది. పొలిటికల్ రిసెర్చ్ విభాగాల్లో పని చేస్తున్న పలువురు తమను సిఎంఓ సిబ్బంది, ఈటీజీ రీసెర్చ్ అనలిస్టులుగా పేర్కొన్నారు. టైమ్స్ గ్రూప్‌లో సర్వే నిర్వహించిన ఈటీజీ సంస్థ కార్పొరేట్ వివరాలేవి అధికారికంగా లేవు. ఆ సంస్థ ముఖ్యమంత్రికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసే ఇరగవరపు అవినాష్‌కు చెందినదనే అనుమానాలను టీడీపీ వ్యక్తం చేస్తోంది. సిఎంఓలో పొలిటికల్ డేటా అనలిసిస్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది మొత్తం అవినాష్‌కు చెందిన సంస్థల్లో పని చేసే ఉద్యోగులని చెబుతున్నారు. ఈటీజీ రిసెర్చ్ సంస్థను నిర్వహించే నవనీత్ కుమార్ ఐఐఎం పట్టభద్రుడు. ఈటీజీ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్ స్థానంలో ఉన్నారు. నవనీత్ కుమార్ విదుర స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారని టీడీపీ అంటోంది.
Next Story