Sun Dec 22 2024 23:26:07 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు నాయుడు అరెస్ట్.. ఏ కేసులో అంటే?
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన
టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో బాబును సిట్, సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. స్కిల్ స్కామ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా, కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో తనను ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. కేసు పేపర్లు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని లాయర్లు కోరారు. రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని పోలీసులు తెలిపారు. అరెస్ట్కు కారణాన్ని పోలీసులు వివరించారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్లో తన పేరు ఎక్కడుందో చెప్పాలన్నారు చంద్రబాబు. తాము ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళుతున్నామన్నారు.
ఎఫ్ఐఆర్ పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు నాయుడు పోలీసులను ప్రశ్నించారు. తనని అరెస్టు చేసే ముందు ఆ పత్రాలను ఇవ్వాలని.. అయితే అరెస్టు చేశాక తగిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. దేని గురించి అరెస్టు చేస్తారనే అడిగే హక్కు సామాన్యులకు కూడా ఉందని చంద్రబాబు అన్నారు.. అరెస్టు నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. డీకే బసు కేసు ప్రకారం వ్యవహరించామని పోలీసులు చెబుతున్నారు. 24 గంటల్లో అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.
Next Story