Mon Dec 23 2024 06:31:02 GMT+0000 (Coordinated Universal Time)
TDP : రికార్డు క్రియేట్ చేస్తున్న టీడీపీ
సభ్యత్వ నమోదులో తెలుగుదేశం రికార్డులు క్రియేట్ చేస్తుంది
సభ్యత్వ నమోదులో తెలుగుదేశం రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకూ స73 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా..ఇందులో 85 వేల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పొందారు. ఇప్పటి వరకు జరిగిన నమోదులో 54 శాతం మంది కొత్త వారు సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో 1.18 లక్షలతో రాజంపేట మొదటి స్థానంలో ఉండగా, నెల్లూరు సిటీలో 1.06 లక్షలు, కుప్పంలో 1.04 లక్షలు, పాలకొల్లులో 1.02 లక్షలు, మంగళగిరిలో 90 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి.
సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు...
సభ్యత్వ కార్యక్రమంపై చంద్రబాబు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ కార్యక్రమంతో పార్టీ బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని సీఎం అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం పొందే పరిస్థితి రావాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. స్కిల్ డవలెప్మెంట్, అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని సిఎం అన్నారు. కేవలం వెల్పేర్ మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెంపుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.
Next Story