Tue Dec 24 2024 13:38:33 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ కు చంద్రబాబు.. ఎయిర్ పోర్ట్ కు భారీగా టీడీపీ కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు జరిగిన ఘటనతో ఆయన అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని, అప్పటి వరకూ తాను సభకు రానని చంద్రబాబు శపథం చేసి మరీ వెళ్లిపోయారు.
నారా లోకేష్ కూడా...
చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 26వ తేదీ వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలున్నాయి. అయితే ఈ సమావేశాలు మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎయిర్ పోర్టు వద్దకు భారీ ఎత్తున టీడీపీ నేతలు చేరుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
Next Story