Mon Dec 23 2024 11:22:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విజయనగరంలో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో జరగనున్న మినీ మహానాడులో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం భోగాపురం నుంచి విజయనగరం దాసన్నపేట రైతు బజారు కూడలి, నెలిమలర్ల, చీపురుపల్లి వరకూ చంద్రబాబు రోడ్ షో ఉంటుంది. రెండు నియోజకవర్గాల్లోనే రోడ్ షో ఉంటుందని పార్టీ నేతలు చెప్పారు.
నియోజకవర్గాల వారీగా...
రేపు నియోజకవర్గాల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తారు. పది నియోజకవర్గాలను చంద్రబాబు సమీక్షిస్తారు. చంద్రబాబు పర్యటన కోసం భారీ ఎత్తున జససమీకరణ చేస్తున్నారు. పది నియోజకవర్గాల నుంచి ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఈ జిల్లాలో కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈ నెల జిల్లాల పర్యటన పూర్తయినట్లవుతుంది.
Next Story