Sun Dec 22 2024 22:14:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బాబు కీలక భేటీ.... అక్కడ హిట్ అయితేనే?
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలతో ఆయన సమావేశం కానున్నా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి 18 మంది నేతలకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. వీరంతా ఉత్తరాంధ్రలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు. వీరితో సమావేశమై చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
మూడు జిల్లాల్లో.....
గత ఎన్నికల్లో విశాఖ లో నాలుగు స్థానాలు, శ్రీకాకుళంలో రెండు స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కాయి. విజయనగరం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తేవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలపై చంద్రబాబు నేడు నేతలతో చర్చించనున్నారు. ఉత్తరాంధ్రలో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, దీనిపై కార్యాచరణను రూపొందిచాలని చంద్రబాబు భావిస్తున్నారు.
Next Story