Mon Dec 23 2024 14:02:39 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి నాని కి బొండా ఉమ సవాల్
మంత్రి కొడాలి నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు
మంత్రి కొడాలి నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాను టీడీపీ అడ్డుకుంటుందంటూ కొడాలి నాని తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీపై విష ప్రచారం చేయడమే కొడాలి నాని పనిగా పెట్టుకున్నారని బొండా ఉమ అన్నారు. తాము ఎన్టీఆర్ పేరును వద్దని అన్నట్లు రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు.
అవగాహన ఉందా?
కొడాలి నాని తన శాఖపై తప్పించి అన్నింటిపైనా అవగాహన ఉందని బొండ ఉమ ఎద్దేవా చేశారు. తన శాఖలో ఉన్న తప్పులు, లెక్కలు ఆయనకు తెలియడం లేదన్నారు. కేసినో పెట్టి మహిళల చేత డ్యాన్స్ చేయించిన కొడాలి నానిని అరెస్ట్ చేయరని, అర్ధరాత్రి తమ పార్టీ నేత అశోక్ బాబును అరెస్ట్ చేస్తారని బొండా ఉమ ఫైరయ్యారు. డీజీపీ దీనికి సమాధానం చెప్పాలని బొండా ఉమ డిమాండ్ చేశారు.
Next Story