Mon Dec 23 2024 09:37:05 GMT+0000 (Coordinated Universal Time)
వ్యక్తిగతమంటూనే వర్ల జూనియర్ ఎన్టీఆర్ పై?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనత్త భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ అసెంబ్లీలో మాట్లాడినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సక్రమంగా లేదని వర్ల రామయ్య అన్నారు. భువనేశ్వరి మేనల్లుడిగా జూనియర్ ఫెయిలయినట్లేనని వర్ల రామయ్య అన్నారు. ఆయన ఈరోజు దీక్ష చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని, తన వ్యక్తిగత మని వర్ల రామయ్య చెప్పారు.
హరికృష్ణ బతికి ఉంటే?
చంద్రబాబు కుటుంబాన్ని అవమానించినందుకు వర్ల రామయ్య తన సతీమణితో కలసి 12 గంటల దీక్షకు దిగారు. హరికృష్ణ బతికి ఉంటే భువనేశ్వరిని అవమానించిన వారిని వదిలిపెట్టే వారు కాదని వర్ల రామయ్య అన్నారు. సినిమాల కోసం జూనియర్ ఎన్టీఆర్ నైతిక విలువలు పాటించడం లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.
Next Story